June 17, 2026 2:19 am

V1News Telangana

శ్రమ భారంతో పోలీసులకు ఇబ్బందులు – కారు బోల్తా సంఘటన కలకలం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన TS 09 PA 3450 బులెరో వాహనం మంగళవారం సాయంత్రం బండర్‌పల్లి బ్రిడ్జ్ వద్ద మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో వాహనంలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

పోలీసు వర్గాల సమాచారం మేరకు, ఎస్సై వృత్తి రీత్యా అధిక పని భారం ఉండటంతో, నిరంతరం విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దాంతో మానసికంగా, శారీరకంగా అలసట పెరిగి ఈ ప్రమాదం జరిగిందని సహోద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సంఘటన పోలీసు శాఖలో పని ఒత్తిడి, విరామం లేకుండా విధులు నిర్వర్తించడం వల్ల కలిగే దుష్ఫలితాలకు నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారుల పని సమయాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more