June 17, 2026 2:17 am

V1News Telangana

రోడ్ల మరమ్మత్తుల కోసం కొండలను పిండి చేస్తున్నారు  ఇష్ట రాజ్యాంగ అనుమతులు ఇస్తున్న గన్నుల శాఖ, రెవెన్యూ శాఖ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రోడ్ల మరమ్మత్తుల కోసం కొండలను పిండి చేస్తున్నారు

ఇష్ట రాజ్యాంగ అనుమతులు ఇస్తున్న గన్నుల శాఖ, రెవెన్యూ శాఖ

ప్రమాదపుటంచున మిషన్ భగీరథ రక్షిత మంచి ట్యాంక్

కాసుల కోసం కాదు పర్యావరణానికి కాపాడడానికి కళ్ళు తెరవండి అధికారులారా..

 

 

 

గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే  రహదారులు పాత్ర కీలకం. రహదారులు బాగుంటే గ్రామాలు, అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంటాయి. దీంతోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుతున్న బాధ్యత అందరిపై ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రహదారుల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారులకు కావలసిన మొరం కోసం పల్లె ప్రాంతంలో చుట్టూ ఉన్న కొండలపై కాంట్రాక్టర్లు కన్ను వేశారు. కొన్నిచోట్ల అధికారుల అనుమతులు లేకుండా అక్రమ మొరం దందా కొనసాగుతుండగా, మరికొన్ని ప్రభుత్వ అనుమతులు గోరంత తీసుకొని కొండంత త్రవ్వకాలు జరుపుతూ కాంట్రాక్టర్లు కోట్లకు గడిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న కొండల వద్ద నుంచి మొరం తవ్వకాల కోసం రెవెన్యూ శాఖ, గనుల శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉండగా, గ్రామానికి పక్కనే గల కొండలను మరో కోసం అనుమతులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వద్ద పెద్ద ఎత్తున ముడుపులు అందుకొని రహదారి పక్కన, గ్రామానికి పక్కన ఉన్న కొండలను మొరం తవ్వడానికి అనుమతి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న కొండను జాతీయ రహదారి నిర్మాణం పనులకు కావలసిన మొరం కోసం రెవిన్యూ శాఖ అనుమతులు ఇచ్చింది. ఆ కొండపైన గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే మిషన్ భగీరథ మంచినీటి రక్షిత ట్యాంకు ఉంది. ట్యాంకుకు 100 మీటర్ల వరకు మొరం త్రవ్వకాలు జరిపారు. దీనివల్ల భవిష్యత్తులో భారీ వర్షాలకు కొండపై నుంచి నీటి ప్రవాహం కు కొండ కోతకు గురై మంచినీటి రక్షిత పథకం ప్రమాదపుటం చునా చేరే ప్రమాదం నెలకొంది. సంబంధిత శాఖ అధికారులకు కాసులు కావాలి, కాంట్రాక్టర్లకు మొరం కావాలి. పర్యావరణం ఎటు పోతే ఏమిటి వారి ఆస్తులు పెరిగితే చాలు అనే విధంగా ఒకవైపు రెవెన్యూ శాఖ, గనుల శాఖ, ఖనిజ అభివృద్ధి శాఖ ఇష్టం వచ్చినట్లుగా అనుమతులు ఇచ్చి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బాన్సువాడ-బోధన్ ప్రధాన రహదారి పక్కనే అక్బర్ నగర్ గ్రామ సమీపంలో ఇలా రక్షిత మంచినీటి పథక వద్ద మొరం కోసం త్రవ్వకాలు జరపడంతో కొండపై ఉన్న రక్షిత మంచి పథకానికి భద్రత లేకుండా పోయింది. భవిష్యత్తులో భారీ వర్షాలకు వరద ప్రవాహానికి కొండ కోతకు గురై రక్షిత మంచిని ట్యాంకు ప్రమాద బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులారా ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయండి, ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోదు లేదంటూ అక్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీసేయడానికి ఇష్ట రాజ్యాంగ మొరం త్రవ్వకాల కోసం అనుమతులు ఇవ్వకండి అంటూ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

,

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more