June 17, 2026 3:38 am

V1News Telangana

*ఏనుగు రవీందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ..?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

*ప్రశ్నించే గొంతుప్రజా నాయకుడు ఉద్యమకారుడు ప్రజా మధ్యలో సమస్యలు తీర్చే నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ ఇంచార్జ్**
బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి శాసనసభ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. మార్చిలో ఏనుగు రవీందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ కట్టపెట్టే అవకాశాలు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమకారుడుగా, కాంగ్రెస్ వాదిగా ముద్ర వేసుకున్న ఏనుగు రవీందర్ రెడ్డిని గత శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి తీసుకువచ్చి బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దించారు. అభ్యర్థిని ఖరారు చేయడంలో జాప్యం జరగడం పట్ల. నెల రోజుల్లోనే బాన్సువాడ నియోజకవర్గ లో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు, ప్రజలు కలవలేకపోయారు. దీంతో భార స అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు వారు ఆ నియోజకవర్గానికి ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యేలుగా భావించవచ్చునని ప్రకటించారు. నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమిపాలైనప్పటికీ బాన్సువాడ నియోజకవర్గాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భార స నుంచి విజయం సాధించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటిలోకి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో బాన్స్వాడ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, పోచర్లు శ్రీనివాస్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎవరికి వారు పెత్తనం చలాయిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏనుగు రవీందర్ రెడ్డి కి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనంతరం ఏనుగు రవీందర్ రెడ్డి కి శాసనసభ కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి వస్తే బాన్సువాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యంగు రవీందర్ రెడ్డి వర్గం సైతం తమ నాయకుడికి పదవి రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వారి కోరిక త్వరలో తీరబోతుంది..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more