V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు పరచాలి….

SHARE:

– ప్రభుత్వ వైఖరి పై నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకులు

– ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని ఆకాంక్ష

– మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేత

– దేశానికి స్వాతంత్రం సాధించిన గొప్ప మహనీయుడని అభివర్ణన

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు .. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి అమలు చేయాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వారు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎంతో కృషిచేసిన మహనీయుడు అని మహాత్మున్ని కొనియాడారు. శాంతియుత మార్గంలో పోరాటం చేసి చివరకు స్వతంత్ర భారతం సాధించే విధంగా ఎంతో కృషి చేశారని అన్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి.. ఈరోజు సర్వేల పేరిట కాలయాపన చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఎద్దేవ చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకున్నారని .. మాటలు మాట్లాడడం తేలికే కానీ పరిపాలన చేయడం అంత సులువు కాదన్న విషయం ఇప్పుడు అర్థమైందని అన్నారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచి పోయినప్పటికీ ఇప్పటివరకు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుపరిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకటి, చుంచు శేఖర్, మోసిన్, దొంతి భాస్కర్, కంది నగేష్, చుంచు కపిల్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india