Post Views: 146
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల బండ గల్లి ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ నర్సు గొండ ఎలాంటి అనుమతులు లేకుండా తన స్థలంలో బండ రాళ్లు బ్లాస్టింగ్ చేయడానికి 40 జిలెటిన్ స్టిక్స్ నిషేధిత పేలుడు పదార్థాలను వినియోగించి పేల్చడానికి ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 40 జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సిఐ అశోక్ తెలియజేశారు.
బైట్: సీఐ అశోక్
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








