V1News Telangana

best news portal development company in india

డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి స్థల పరిశీలన చేసిన అధికారులు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) జె. అరుణ శ్రీ

SHARE:

డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి స్థల పరిశీలన చేసిన అధికారులు

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) జె. అరుణ శ్రీ

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 03:-

గోదావరిఖని డంపింగ్ యార్డ్ స్థలాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) జె. అరుణ శ్రీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముందుగా రామగుండం లోని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను సందర్శించి పూర్తి సామర్ధ్యంతో పని చేసేందుకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. నీటిని పూర్తిగా శుద్ది చేసిన తరువాతనే బయటకు వదలాలని అన్నారు. అలాగే ప్లాంట్ లో పని చేసే సిబ్బందికి అవసరమైన మరుగు దొడ్లు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ – 4 సమీపంలో డంపింగ్ యార్డ్ కొరకు సింగరేణి సంస్థ కేటాయించిన స్థలం ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న హిందూ శ్మశాన వాటిక ను సందర్శించారు. శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు , సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. శ్మశాన వాటికలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఈ సంధర్భంగా రామగుండం నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ రాయలింగు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డి ఇ శాంతి స్వరూప్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం , కుమార స్వామి తదితరులు ఉన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india