-- --

హాజరు శాతం తక్కువగా ఉందని విద్యార్థులను వేధించడం సరికాదు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించాలి: కాయితి శంకర్…

జగిత్యాల, నవంబర్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో పరీక్ష ఫీజు చెల్లించకుండా అడ్డుకోవడం సరికాదని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ అన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వై. ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో ప్రధానోపాధ్యాయులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ విషయంపై స్పందించి, అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరం కాకుండా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

హాజరు శాతం సమస్య కారణంగా విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కాయితి శంకర్ కోరారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more