-- --

నెహ్రూ ఆశయాలు.. ఆధునిక భారత నిర్మాణానికి బాటలు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు..

బోధన్: భారత తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను బోధన్ పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ గంగా శంకర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. అప్పటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు, శాస్త్ర, సాంకేతిక, విద్యా రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.

దేశాభివృద్ధికి నెహ్రూ అందించిన సేవలు, ఆయన దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రలో ఆయన పోషించిన పాత్రను సమగ్రంగా అర్థం చేసుకుని, ఆయన ఆశయాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర, పట్టణ ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నెహ్రూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, జిల్లా నాయకులు పాషా మొహినుద్దీన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ అంకు దాము, సీనియర్ నాయకులు నక్క లింగారెడ్డి, కౌన్సిలర్లు, వివిధ కమిటీల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more