-- --

రాజకీయాలకు అతీతంగా పరస్పర గౌరవం.. పదవులు పొందిన వారికి టీడీపీ ఘన సన్మానం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

..బోధన్‌లో మార్కెట్ కమిటీ, సొసైటీ చైర్మన్లతో పాటు పలువురు నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులకు సత్కారం….

బోధన్, నవంబర్ 6: రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవించడం ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తుందని చాటుతూ బోధన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా వివిధ పదవులు పొందిన నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంచే వివిధ పదవులకు నియమితులైన బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని నాగేశ్వరరావు, బోధన్ సొసైటీ చైర్మన్ పోత రెడ్డి, సాలూర సొసైటీ చైర్మన్ అల్లే రమేష్, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, మార్కెట్ డైరెక్టర్ బి. కృష్ణారెడ్డి, బోధన్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలను ఈ సందర్భంగా శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి కె. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా జీవితంలో వివిధ బాధ్యతలు చేపట్టిన వారిని గౌరవించడం మంచి సంప్రదాయమని అన్నారు. నూతనంగా పదవులు పొందిన వారందరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రైతులు, సహకార సంఘాల సభ్యులు, సామాన్య ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమకు పదవులు లభించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత గౌరవం, పరస్పర స్నేహభావం కొనసాగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామమని పేర్కొన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు రైతుల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తాయని, రైతులకు అవసరమైన సేవలు అందించడం, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారు చొరవ చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడు ఎం. బాల గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, టీఎన్‌ఎస్‌ఎస్ పార్లమెంట్ అధ్యక్షుడు సచిన్ పటేల్, బోధన్ మండల పార్టీ కార్యదర్శి విట్టల్ పటేల్, కాంగ్రెస్ నాయకులు గీరారెడ్డి, పెగడపల్లి నాయకుడు మద్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more