## బదిలీపై భువనగిరికి వెళ్తున్న సాయి శివకు ఆత్మీయ వీడ్కోలు..
బోధన్, నవంబర్ 5 (v1 న్యూస్): బోధన్‌లో న్యాయమూర్తిగా సేవలందించి, బదిలీపై భువనగిరికి వెళ్తున్న ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సాయి శివకు గురువారం ఘనంగా సన్మానం నిర్వహించారు. బోధన్ కోర్టు భవన సముదాయ ప్రాంగణంలో న్యాయవాద గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి శివకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. బోధన్‌లో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, న్యాయవ్యవస్థ పట్ల ఆయనకున్న నిబద్ధతను, విధి నిర్వహణలో చూపిన బాధ్యతాయుతమైన వైఖరిని కొనియాడారు.
న్యాయమూర్తిగా ఆయన అందించిన సేవలు బోధన్ న్యాయవర్గానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బదిలీపై మరో ప్రాంతానికి వెళ్తున్నప్పటికీ, ఆయనతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సంఘం సభ్యులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. భువనగిరిలోనూ మరింత ఉన్నతంగా సేవలందించి, న్యాయవ్యవస్థలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాద గుమాస్తాల సంఘం సభ్యులు రఘుపతి భూమయ్య, శ్రీనివాస్, సందీప్, హన్మాండ్లు, జమీర్, అన్వర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








