-- --

## రైతుల అభ్యున్నతే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

### రైతుల అభ్యున్నతే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం

ఎన్డీసీసీబీ సీఈవో నాగభూషణంను మర్యాదపూర్వకంగా కలిసిన బోధన్, సాలూర సొసైటీల చైర్‌పర్సన్లు

బోధన్, నవంబర్ 3 (జన వేగం): రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార సంఘాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎన్డీసీసీబీ బ్యాంక్ సీఈవో నాగభూషణం సూచించారు. రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని, వారి అవసరాలను గుర్తించి సకాలంలో సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం బోధన్, సాలూర మండలాలకు చెందిన వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్‌పర్సన్లు ఎన్డీసీసీబీ బ్యాంక్ సీఈవో నాగభూషణంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సహకార సంఘాల అభివృద్ధికి, రైతులకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు బ్యాంకు తరఫున సహాయ సహకారాలు అందించాలని చైర్‌పర్సన్లు సీఈవోను కోరారు. రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బ్యాంకు, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఈవో నాగభూషణం మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించాలని చైర్‌పర్సన్లకు సూచించారు. సంఘాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందించుకుని రైతులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

రైతులకు అవసరమైన సదుపాయాలను సకాలంలో సమకూర్చి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే నిజమైన విధి నిర్వహణ చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. సహకార సంఘాలు రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో సొసైటీల చైర్‌పర్సన్లు పోతిరెడ్డి, మల్లవరపు సుందర్‌రాజు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, సూర రవి, ఫర్మేశారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more