-- --

ఎరాజ్ పల్లిలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భాజాభజంత్రీల నడుమ అమ్మవారికి బోనాల సమర్పణ.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామ మహిళలు…

బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో శుక్రవారం పోచమ్మ బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకొని భాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి తరలివెళ్లారు.

అనంతరం పోచమ్మ తల్లితో పాటు గ్రామదేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు.

పంటల కోతకు ముందు ప్రతి సంవత్సరం సంప్రదాయంగా పోచమ్మ పండుగను నిర్వహించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామదేవతలను పూజించడం ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటడంతో పాటు గ్రామ ప్రజల ఐక్యతను, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పండుగలో గ్రామ సర్పంచ్ దేవదాస్ గౌడ్, వీడీసీ పెద్దోళ్ల నర్సారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ సురకంటి పవన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. భక్తుల సందడితో గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more