కోలాటాలు, నృత్యాలతో భక్తుల సందడి…
బోధన్, అక్టోబర్ 21 (V1 న్యూస్ తెలంగాణ): బోధన్ మండలం కల్దుర్కీ గ్రామంలో దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర బుధవారం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, విడిసి ప్రతినిధి బంటు గంగాధర్, విగ్రహ దాత మల్లెపూల శంకర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జిమ్మల గంగాధర్, ఉపాధ్యక్షుడు నఠన్ నాగు, కార్యదర్శి బంటు రమేష్ పాల్గొన్నారు.
కమిటీ సభ్యులు న్యాలం శ్రీనివాస్, చిలుక అశోక్, కుర్లె మోహన్, సాయిబాబా, విద్యాసాగర్ చారి, యాదవరావు, అశోక్, వడ్డె లక్ష్మణ్, నఠన్ నారాయణ్, జిమ్మల సాయిలు, తోట రవి, శ్రీశైలం వీరశైవ గురుకుల విద్యార్థి, పూజారి మల్లాయప్ప, జంగం సిద్ధాయప్ప, అమ్మవారి మాలధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







