రైతు సమస్యలపై పలు కీలక తీర్మానాలు
సాలూర, సెప్టెంబర్ 28: సాలూర మండలంలోని సాలూర, జాడి జమాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఆవరణలో సోమవారం వార్షిక మహాజనసభలు నిర్వహించారు. ఆయా సంఘాల అధ్యక్షులు అల్లె జనార్ధన్, దాసరి అంతయ్య అధ్యక్షతన సభలు జరిగాయి.
ఈ సందర్భంగా సంఘాల సీఈఓలు కండెల సంజీవ్, శివరామకృష్ణ ఆయా సంఘాలకు సంబంధించిన జమా–ఖర్చుల వివరాలను సంఘ పాలకవర్గం, రైతుల సమక్షంలో చదివి వినిపించారు. అనంతరం సంఘాల అభివృద్ధి, రైతుల సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో మాదిరిగానే యూరియా సరఫరా చేయాలని మహాజనసభ డిమాండ్ చేసింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని తీర్మానించారు.

అదేవిధంగా సాలూర సొసైటీ ఆధ్వర్యంలో ధర్మకోట ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహకార సంఘాల నూతన బైలాస్‌ను కూడా మహాజనసభ ఆమోదించింది.
కార్యక్రమంలో సంఘాల పాలకవర్గ సభ్యులు, రైతులు, సొసైటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







