కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, సెప్టెంబర్ 5: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కోసడి వేదాన్సు గుర్తుతెలియని మహిళ చేత అపహరణకు గురైన ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నారి ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తండ్రి నరేష్‌తో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకుని ధైర్యం చెప్పారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన చర్యలను కమిషనర్ సమీక్షించారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే చిన్నారిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్న గుర్తుతెలియని మహిళను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని సూచించారు. చిన్నారి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోందని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఘటనను సీరియస్‌గా పరిగణిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు…
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







