-- --

ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: AERO, తహసీల్దార్ ఆజ్మత్ నవాజ్…

“ఓటరు జాబితాలో పేరు లేదా? శిబిరాలను సద్వినియోగం చేసుకోండి”

మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్‌కు బాట!”

సాలూర, సెప్టెంబర్ 4: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా సాలూర మండల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO), తహసీల్దార్ ఆజ్మత్ నవాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు ఓటరు జాబితాలో పేరు నమోదు కానివారు, చిరునామా మారినవారు, పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నవారు ఈ శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. అర్హతను బట్టి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అవసరమైన దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

శిబిరాల వద్ద సంబంధిత BLOలు అందుబాటులో ఉంటారని, దరఖాస్తుదారులు అవసరమైన గుర్తింపు, వయస్సు, చిరునామా తదితర ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించుకోవాలని AERO, తహసీల్దార్ ఆజ్మత్ నవాజ్ కోరారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more