Post Views: 45
సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం….
బోధన్: ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రతినిధి గంగా శంకర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రజా పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. “ఇది కేవలం సంబరం కాదు.. ప్రజా ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం” అని అన్నారు.
కార్యక్రమంలో బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, బోధన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్‌రెడ్డి, పాషాభాయ్, బోధన్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







