-- --

సాయన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర, సెప్టెంబర్ 2: నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలూర గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇల్తెపు సాయన్న, మాజీ సర్పంచ్ మృతి పట్ల బోధన్ మాజీ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షకీల్ అమెర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాలూర గ్రామంలోని సాయన్న నివాసానికి వెళ్లిన షకీల్ అమెర్.. ఆయన అల్లుడు కేజీ గంగారాంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, సాయన్న మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సాయన్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటు కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తీరనిదని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

సాయన్న మృతి పట్ల గ్రామస్తులు, బంధుమిత్రులు సైతం సంతాపం వ్యక్తం చేశారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more