వేద ధర్మం, యజ్ఞం, సంస్కృతి గొప్పతనాన్ని ప్రజలకు చాటడమే లక్ష్యం
బోధన్, ఆగస్టు 28 (V1 న్యూస్): బోధన్ పట్టణంలోని ఆర్య సమాజ్ దయానంద్ గోశాలలో శ్రావణి ఉపాకర్మ వేద ధర్మ ప్రచార యజ్ఞ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోమం, యజ్ఞ కార్యక్రమాలను చేపట్టి వేద మంత్రాలను పఠించారు.

ఈ సందర్భంగా తెనాలికి చెందిన యజ్ఞ బ్రహ్మ శ్రీమాన్ మేఘం కృష్ణమూర్తి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, చిన్నారులు, పెద్దలు సుఖశాంతులతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు.
యజ్ఞ కార్యక్రమంలో శ్రీ ప్రదీప్ గుప్తా, శ్రీమతి మాధవి, శ్రీ మంచాల శ్రీనివాస్, శ్రీ వేముల సంజయ్, శ్రీమతి సునీత, శ్రీ రాజేశ్వర్ ఆర్య, శ్రీ సాయి రెడ్డి, శ్రీ మంచాల స్వామి, శ్రీ శంకర్ ప్రకాష్, శ్రీమతి సుగుణ తదితరులు పాల్గొన్నారు.

వేద ధర్మం, యజ్ఞం, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడం, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు, ఆర్య సమాజ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







