-- --

సద్వినియోగం చేసుకోండి* టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సద్వినియోగం చేసుకోండి* టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ గారు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చని తెలిపారు. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ప్రయాణ సమయంలో ఇబ్బందులు, ఆలస్యాలు లేకుండా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 31 అనగా సోమవారం నాడు స్వస్థలానికి లేదా తిరుగు ప్రయానం రోజుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ముందస్తు టికెట్లను www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని మరియు రిజర్వేషన్ కౌంటర్ నందు కూడా టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం కలదని తెలిపారు. అంతేకాకుండా, ప్రయాణికులు ముందస్తుగా చేసుకునే బుకింగ్ లేద ప్రయాణికుల రద్దీని అంచనా వేసి, అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసే అవకాశం టీజీఎస్ఆర్టీసీకి ఉంటుంది. తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించవచ్చని రీజినల్ మేనేజర్ గారు తెలిపారు. కావున ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

anantoji Kalidas
Author: anantoji Kalidas

Ananthoji kalidas Telangana-Maharastra Beuro Mobile number:-+91 99214 04070

Leave a Comment

Read more