-- --

“బోధన్‌కు నిధులు ఏవి..? 3,500 ఇళ్లను 22–ఏలో ఎందుకు చేర్చారు?” — కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే షకీల్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కాంగ్రెస్ పాలనలో బోధన్‌కు ఒరిగిందేమిటి? — మాజీ ఎమ్మెల్యే షకీల్

బోధన్: బోధన్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే తాము స్వాగతిస్తామని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కవితపై తనకు అపారమైన గౌరవం ఉందని షకీల్ పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని సూచించారు.

కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బోధన్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని షకీల్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? బోధన్‌కు వచ్చిన నిధులు ఎక్కడ? నియోజకవర్గ అభివృద్ధి ఏ దిశలో సాగుతోంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సొంత నియోజకవర్గానికి నిధులు ఎందుకు తీసుకురాలేదు?”

బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డిపై షకీల్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. పక్క నియోజకవర్గాలకు నిధులు సమకూర్చే పరిస్థితి ఉంటే, బోధన్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ల ప్రభుత్వంగా మారిందని షకీల్ ఆరోపించారు. పెద్ద ఎత్తున భూములను 22–ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3,500 నివాస గృహాలను 22–ఏ పరిధిలోకి తీసుకువచ్చారని పేర్కొంటూ, ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

ప్రజల భూములు, ఇళ్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, బాధితులకు న్యాయం చేయాలని షకీల్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గిరిధర్ గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, ఆయా మండలాల అధ్యక్షులు నర్సయ్య, శ్రీరాములు, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more