-- --

సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యల్లో భాగంగా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు గురువారం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండ పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది అంజాద్, గంగాధర్, శ్రావణ్, రమేష్ లు ఉన్నారు.

anantoji Kalidas
Author: anantoji Kalidas

Ananthoji kalidas Telangana-Maharastra Beuro Mobile number:-+91 99214 04070

Leave a Comment

Read more