బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026)లో భాగంగా నోటీసులు జారీ చేసిన అనంతరం నిర్వహించే హియరింగ్ ప్రక్రియకు బోధన్ ఆర్డీవో యం. విజయకుమారి శ్రీకారం చుట్టారు.
ఖండ్గాంవ్‌లోని పోలింగ్ స్టేషన్ (PS) నంబర్ 01లో బోధన్ ఎంపీడీవో సమక్షంలో హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత ఓటరు వివరాలను ఆన్‌లైన్ విధానంలో పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను అధికారులు చేపట్టారు.

అనంతరం బోధన్ గుంజ్‌రోడ్‌లోని PS నంబర్ 61 వద్ద బోధన్ తహసీల్దార్ సమక్షంలో ఇదే విధానంలో హియరింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR-2026లో కీలకమైన హియరింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో యం. విజయకుమారి మాట్లాడుతూ.. హియరింగ్‌కు నోటీసులు అందిన ఓటర్లు తప్పనిసరిగా హాజరై, ముందుగా సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. నిర్దేశిత పత్రాలతో హియరింగ్‌కు హాజరుకాకపోతే, ఓటు హక్కుకు సంబంధించిన పరిశీలనలో ఇబ్బందులు ఏర్పడి ఓటు జాబితాలో పేరు కోల్పోయే అవకాశం ఉంటుందని ఆమె హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







