బోధన్: 35వ వార్డు సరస్వతినగర్‌లోని జ్ఞానవాటిక స్కూల్ పక్కన, పోచమ్మ ఆలయం సమీపంలో నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు 35వ వార్డు కౌన్సిలర్ తూము పద్మశరత్ రెడ్డి పర్యవేక్షించారు.
ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో చేపడుతున్న పనులను పరిశీలించిన ఆమె, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే సరస్వతినగర్ ప్రాంత ప్రజలకు మురుగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని తెలిపారు.
పనులు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ పనులు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







