మెరుగైన వసతులు కల్పింవిద్యార్థులకు నాణ్యమైన విద్య, చాలి.
వి.1 న్యూస్, బోధన్, ఆగస్టు 24: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠ్యపుస్తకాల లభ్యత, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు.
విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలను పరిశీలించిన ఎమ్మెల్యే, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయా అని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన విద్యా వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విద్యా సంస్థలపై ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

కళాశాలలో విద్యా ప్రమాణాలను మరింత పెంచడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలకు తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









