-- --

SIRపై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ ERO, RDO విజయకుమారి..

Oplus_16908288

సాలూర, నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 26: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు బోధన్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO), రెవెన్యూ డివిజనల్ అధికారి విజయకుమారి తెలిపారు.

SIR ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గ్రామ సభల్లో డ్రాఫ్ట్ ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించనున్నట్లు తెలిపారు.

అలాగే గ్రామ సభల్లో మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్ల వివరాలు, డబుల్ ఎంట్రీగా నమోదైన ఓటర్ల గుర్తింపు, గైర్హాజరైన ఓటర్ల జాబితా తదితర వివరాలను ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలిపారు.

ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు ఈ గ్రామ సభలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని విజయకుమారి కోరారు. ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉన్నా, పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నా గ్రామ సభలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గ్రామ సభల్లో BLOలు, BLO సూపర్‌వైజర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొని నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు విధానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

సరైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమని, ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో భాగస్వాములై తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలని ERO విజయకుమారి విజ్ఞప్తి చేశారు.

సాలూర తహసీల్దార్ అజ్మల్ నవాజ్ విషయాన్ని ప్రకటించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more