-- --

: నేడు గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక గ్రామసభలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర: మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో భాగంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు మండల తహసీల్దార్‌ అజ్మత్‌ నవాజ్‌ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు గ్రామసభలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
బోధన్‌ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), రెవెన్యూ డివిజనల్‌ అధికారి విజయకుమారి ఆదేశాల మేరకు గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఈ సమావేశాల్లో డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్ల షిఫ్ట్‌ కేసులు, డబుల్‌ ఎంట్రీ అయిన ఓటర్ల వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితా తదితర అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు.
ఓటరు జాబితాలో తమ పేర్లకు సంబంధించిన తప్పులు, చిరునామా మార్పులు లేదా పేర్ల తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు గ్రామసభలోనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్‌ సూచించారు. ఎస్‌ఐఆర్‌ గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more