బోధన్, జూన్ 22 (ప్రతినిధి):
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బోధన్ శాసనసభ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఆర్వో/ఆర్డీఓ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బీఎల్‌ఏలు (BLAలు), బీఎల్‌వోలు (BLOలు) పోషించాల్సిన బాధ్యతలు, వోటరు జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలను వివరించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వినియోగించాల్సిన మొబైల్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించిన ఆయన, ఓటరు జాబితా తయారీ సమయంలో ఒక్క అర్హుడైన ఓటరికి కూడా అన్యాయం జరగకుండా, అలాగే ఒక్క అనర్హుడైన వ్యక్తి కూడా జాబితాలో చేరకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బీఎల్‌వోలకు ప్రజల నుంచి పూర్తి సహకారం అందేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీ పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వెంటనే పరిష్కరించాలని సూచించారు.

బోధన్ నియోజకవర్గంలోని SIR-2026 ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి, పారదర్శకమైన మరియు తప్పులేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఈఆర్వో/ఆర్డీఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







