May 31, 2026 2:48 am

V1News Telangana

సాలూర మండలం లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన మోర్లపై మట్టి, మొరం పోసి కబ్జాలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

డ్రైనేజీల ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం..?

ప్రభుత్వ నిధులతో నిర్మించిన మోర్లపై మట్టి, మొరం పోసి కబ్జాలు

తక్షణ చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తుల హెచ్చరిక..

నిజామాబాదు , మే 30 (v1వార్తా ప్రతినిధి):సాలూర 
గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో, ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) పథకం కింద లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థలు కొంతమంది వ్యక్తుల ఆక్రమణలకు గురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ మోర్లు, నీటి పారుదల మార్గాలపై మట్టి, మొరం పోసి ఆక్రమించుకోవడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటోందని పేర్కొంటున్నారు.

గ్రామంలో జరుగుతున్న ఈ అక్రమ ఆక్రమణలు సంబంధిత పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు, గ్రామపంచాయతీ సిబ్బందికి, సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ మార్గాలను ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని, అసలు స్థితిని పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేసి, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more