May 31, 2026 2:48 am

V1News Telangana

సాలుర మండలంలో అధిక ధరలకు పెట్రోల్ విక్రయాలు – కల్తీ పాల అమ్మకాలపై ఆరోపణలు….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూరలో పెట్రోల్ బ్లాక్ మార్కెట్ జోరు..!
పెట్రోల్ బంక్ మూసివేతను అవకాశంగా మార్చుకున్న వ్యాపారులు
అధిక ధరలకు పెట్రోల్ విక్రయాలు – కల్తీ పాల అమ్మకాలపై ఆరోపణలు..
సాలూర, ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో గత కొన్ని రోజులుగా అనివార్య కారణాలతో పెట్రోల్ బంక్ మూసివేయబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు కిరాణా దుకాణదారులు పెట్రోల్‌ను అక్రమంగా విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, పెట్రోల్ బంక్‌లో లభించే ధర కంటే లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తూ కొన్ని దుకాణాల్లో పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.130 నుంచి రూ.140 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అత్యవసర అవసరాల నేపథ్యంలో వాహనదారులు అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో కొన్ని కిరాణా దుకాణాల్లో కల్తీ పాల విక్రయాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లీటర్ పాలను రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నప్పటికీ, పాలలో అధికంగా నీరు కలిపి వినియోగదారులను మోసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పెట్రోల్ అక్రమ విక్రయాలు, కల్తీ పాల వ్యాపారం వంటి వ్యవహారాలు బహిరంగంగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరఫరా శాఖ, పౌర సరఫరాల విభాగం, ఆహార భద్రత శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల డిమాండ్లు:
అక్రమ పెట్రోల్ విక్రయాలపై ప్రత్యేక దాడులు నిర్వహించాలి.
కల్తీ పాల విక్రయాలపై నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేయాలి.
సాలూర పెట్రోల్ బంక్‌ను త్వరితగతిన పునఃప్రారంభించాలి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more