తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతాన్ని ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా కర్రెగుట్టలోని పామూనూరు బేస్ క్యాంప్ సమీపంలో పోలీస్ ఔట్‌పోస్ట్ మరియు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇకపై మావోయిస్టుల కార్యకలాపాలు లేవని పేర్కొన్న డీజీపీ, ఇంకా అరణ్య ప్రాంతాల్లో ఉన్న మిగిలిన మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయి సాధారణ జీవన విధానంలో చేరాలని సూచించారు.
శాంతి, భద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని ఆయన తెలిపారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







