May 2, 2026 10:27 pm

V1News Telangana

సన్న బియ్యం పంపిణీ ప్రారంభం – పేదలకు నాణ్యమైన ఆహార భద్రత… . భైంసా టౌన్‌లో సన్న బియ్యం ప్రారంభించిన నారాయణరావు పటేల్.. . రెండో దశ హామీ అమలు – సన్న బియ్యం ద్వారా పేదలకు ఊరట.. . రైతు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి – కాంగ్రెస్ నేతల స్పష్టత… ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలు – బోస్లే నారాయణరావు పటేల్ హామీ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భైంసా టౌన్‌లోని 5వ, 6వ వార్డుల రేషన్ షాపుల వద్ద ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పేదవారికి నాణ్యమైన బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా నారాయణరావు పటేల్ మాట్లాడుతూ, “మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మద్దతునందిస్తాం” అని అన్నారు.అలాగే, బైంసా టౌన్ అభివృద్ధికి ఇప్పటికే రూ. 2 కోట్లు కేటాయించామనీ, మరిన్ని పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిగా, ప్రధాని మోదీ ఇచ్చిన “జనధన్ ఖాతాలకు రూ. 15 లక్షలు” హామీపై ఇప్పటికీ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో భైంసా తహసీల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, వైస్ చైర్మన్ ఫరుగ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డా తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more