May 2, 2026 10:12 pm

V1News Telangana

వనితా నీకు వందనం.. మహిళా శిరోమణి 2025 అవార్డుల ప్రధానోత్సవం….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి

– విద్యారంగంలో అందించిన ఉత్తమ సేవలు గుర్తించి ఎంపికైన ఉపాధ్యాయిని

– మల్లెపూల ఇందిర (స్కూల్ అసిస్టెంట్ జెడ్పిహెచ్ఎస్ నసురుల్లాబాద్)

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా “శిఖరం ఆర్ట్ థియేటర్స్”సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పదిమందిని ఎంపిక చేయగా .. విద్యారంగంలో అందించిన ఉత్తమ సేవలకు గాను తెలంగాణ రాష్ట్రం నుండి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన మల్లెపూల ఇందిర (స్కూల్ అసిస్టెంట్ జెడ్ పి హెచ్ ఎస్ నసరుల్లాబాద్) మహిళా మణులను గుర్తించి వారికి మార్చి 12 బుధవారం రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక, చిక్కడపల్లి హైదరాబాద్ నందు ముఖ్యఅతిథి మాజీ కేంద్రమంత్రి డా . సముద్రాల వేణుగోపాల చారి చేతుల మీదుగా “వనితా నీకు వందనం .. మహిళా శిరోమణి” 2025 అవార్డులను ప్రధానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యారంగంలో ఉత్తమ సేవలు కనబరచి అవార్డు అందుకోబోతున్నందుకు ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more