TGSRTC బోధన్ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా
మహిళా సిబ్బందికి ప్రత్యేక పోటీలు – విజేతలకు సత్కారం
RTC బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణీకులకు ఘన సన్మానం
మహిళా సాధికారతకు అంకితమైన ప్రత్యేక కార్యక్రమం
. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు – ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
TGSRTC, బోధన్ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని TGSRTC, బోధన్ డిపో నందు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సిబ్బందికి, అలాగే మగ సిబ్బంది జీవిత భాగస్వాములకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.
అంతేకాకుండా, RTC బస్సుల్లో ప్రయాణించి సంస్థను ఆదరించిన మహిళా ప్రయాణీకులను బస్టాండ్ ఆవరణలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Dr. సాల్విన కాంత్ గారు, విశిష్ట అతిథిగా శ్రీమతి లంక జెరూషా గారు హాజరయ్యారు. డీఎం శ్రీనివాస్, AE శ్రావణ్, STI లక్మన్, సూపర్వైజర్లు, సిబ్బంది, ప్రయాణీకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళా సాధికారత, సమానత్వం, RTC లో మహిళల పాత్ర గురించి ముఖ్య అతిథులు ప్రాసంగించారు. మహిళల భాగస్వామ్యం సంస్థ అభివృద్ధికి ఎంతో మేలని పేర్కొన్నారు.
ఈ వేడుకలు మహిళా సాధికారతకు గుర్తుగా నిలిచాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






