May 3, 2026 1:23 am

V1News Telangana

నిర్లక్ష్యపు కోరల్లో “జీవన్ దాన్” రక్త నిధి బ్యాంకు …. – రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తున్న వైనం – ప్రాణాపాయస్థితిలో బాధితులకు అందించాల్సిన రక్తం విషయంలో కూడా రాజకీయాలు – ససేమీరా ఇవ్వమని బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బంది – “జీవన్ దాన్”రక్త నిధి బ్యాంకు సిబ్బంది నిర్వాకం – బహిరంగ మార్కెట్లో( బ్లాక్ లో) అధిక ధరలకు రక్తాన్ని అమ్ముకుంటున్నట్లు పలు అనుమానాలు – సామాజిక సేవ అనే ముసుగులో రక్తంతో వ్యాపారం చేస్తూ అక్రమ సంపాదన – స్థానికులకు అవసరానికి ఉపయోగపడని రక్త నిధి బ్యాంకులు ఎందుకని ప్రజల నుండి పలు విమర్శలు – ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంపై బాధితుల ఆవేదన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

: బైంసా పట్టణంలో గత 14 రోజుల క్రితం గోపాల్ అనే వ్యక్తి తన తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అలేఖ్య ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువగా ఉందని నిర్ధారించారు.

రక్తం ఎక్కించాలని తెలిపి “జీవన్ దాన్”రక్త నిధి బ్యాంకులో లభిస్తుందని అక్కడినుండి తెచ్చుకోవాలని తెలపడంతో గోపాల్ వాళ్ల తండ్రి రక్త నిధి బ్యాంకు దగ్గరికి వెళ్ళగా అక్కడ పనిచేసే సిబ్బంది అతనిని గంటల తరబడి కూర్చోబెట్టి ఎవరైనా ఒకరు రక్తం దానం చేస్తేనే ఇస్తామని, దాంతోపాటు రూ.1800 కూడా చెల్లించాలని తెలిపారని అన్నారు. ఈ విషయాన్ని అంగీకరించిన అతను నా భార్య ఆరోగ్యం చాలా క్షీణించింది తొందరగా రక్తం ఇవ్వాలని ఎంతగా ప్రాధేయపడిన ఇవ్వకపోగా ఆయన మనోభావాలు దెబ్బ తినే విధంగా దురుసు మాటలు మాట్లాడి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు…

అనంతరం గోపాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న తన స్నేహితుడి తో ఫోన్లో మాట్లాడి చెప్పించినప్పటికీ ఇవ్వలేదని.. పైగా మీరు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం అందించారని అక్కడి నుండే తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. లక్షల రూపాయలు వెచ్చించి రక్త నిధి బ్యాంకులను నెలకొల్పామని.. ఆ డబ్బులు తిరిగి సంపాదించాలంటే మీలాంటి వారి దగ్గర వసూలు చేస్తేనే అవుతాయని కించపరిచే విధంగా చేస్తూ మాట్లాడారని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో త్వరితగతిన రక్తం అందించి ప్రాణాలు కాపాడాల్సిన రక్త నిధి బ్యాంకు సిబ్బంది ఈ విధంగా మానవత్వం లేకుండా వ్యవహరించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ముసుగులో ఇలా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న “జీవన్ దాన్” రక్త నిధి బ్యాంకు అనుసరిస్తున్న నిర్లక్ష్యం పట్ల సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని వారి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి చర్యల పట్ల సహనం కోల్పోయి చివరికి గోపాల్ తన తల్లికి మహారాష్ట్రలో చికిత్స అందించానని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదురుగా ఉందని.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పేదల పరిస్థితి ఏంటని పలువురు ప్రజలు” జీవన్ దాన్”బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ స్థానికంగా పనిచేస్తున్న పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ విషయంపై స్పందించకపోవడంతో మీడియా పనితీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రక్త నిధి బ్యాంకు వద్దకు వెళ్లి వివరణ అడగగా వారిపట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత శాఖ ఉన్నత అధికారులు వెంటనే స్పందించి “జీవన్ దాన్”రక్త నిధి బ్యాంకు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more