పాత వార్తా కటింగ్‌లతో అపోహలు సృష్టించవద్దు!
వార్తా శీర్షికలో జరిగిన పొరపాటుపై V1 News Telangana మనస్ఫూర్తిగా క్షమాపణలు..
తప్పుగా ప్రచురితమైన వార్త..

ప్రచురించిన అరగంటలోనే పొరపాటును గుర్తించి వార్త తొలగింపు, సవరణతో పునఃప్రచురణ….
బంజారా సంఘం సభ్యులు, నాయకులు, అధికారులు వాస్తవాలను గమనించాలని విజ్ఞప్తి…
V1 News Telangana ప్రత్యేక ప్రకటన
ఒక వార్తకు సంబంధించిన శీర్షిక ప్రచురణలో అనుకోకుండా జరిగిన పొరపాటుపై V1 News Telangana తరఫున మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ పొరపాటు కారణంగా గిరిజన సంఘాల నాయకులు, బంజారా సంఘం సభ్యులు, కార్యకర్తలు, గిరిజన సోదర సోదరీమణులు, ప్రజలు, అధికారులు ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.
పొరపాటును గుర్తించిన వెంటనే సవరణ చర్యలు….
సదరు వార్త ప్రచురించిన సుమారు అరగంటలోనే కొందరు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మేము జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తూ, తప్పుగా ప్రచురితమైన వార్తను తొలగించాం. అనంతరం సంబంధిత శీర్షికను సరిచేసి వార్తను తిరిగి ప్రచురించాం.
జరిగిన పొరపాటును సమర్థించుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. అది మా వైపు నుంచి జరిగిన తప్పిదమేనని స్పష్టంగా అంగీకరిస్తున్నాం. ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అయినప్పటికీ, మా ప్రచురణ వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే అందుకు మరోసారి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాం.
పాత వార్తా కటింగ్‌లను ఫార్వర్డ్ చేస్తూ అపోహలు సృష్టించవద్దు…
అయితే, పొరపాటును సరిదిద్ది వార్తను తిరిగి ప్రచురించినప్పటికీ, తొలగించిన పాత వార్తా కటింగ్‌ను కొందరు వాట్సాప్ గ్రూపుల ద్వారా బంజారా సంఘం సభ్యులకు ఫార్వర్డ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
ఈ పరిణామం వల్ల వాస్తవ పరిస్థితులు తెలియని వారిలో అపోహలు ఏర్పడే అవకాశం ఉంది. సరిదిద్దిన వార్తను పరిగణనలోకి తీసుకోకుండా పాత కటింగ్‌ను మాత్రమే ప్రచారం చేయడం వల్ల అనవసరమైన అపార్థాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నాం.
ఈ నేపథ్యంలో బంజారా సంఘం నాయకులు, సభ్యులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని కోరుతున్నాం.
పాత వార్తా కటింగ్ ఆధారంగా ఎలాంటి అపోహలకు గురికాకుండా, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే, సరిదిద్దిన వార్తను పరిగణనలోకి తీసుకోకుండా పాత కటింగ్‌లను మాత్రమే ప్రచారం చేయడం ద్వారా ఎవరినీ అపార్థాలకు గురిచేయవద్దని కోరుతున్నాం.
గిరిజన సమాజం పట్ల మాకు గౌరవం ఉంది…
గిరిజన సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, ఆత్మగౌరవం పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలను గౌరవించడం మీడియా బాధ్యతగా భావిస్తున్నాం.
జరిగిన పొరపాటును గుర్తించిన వెంటనే సరిదిద్దుకోవడం, బాధితుల మనోభావాలను గౌరవిస్తూ క్షమాపణలు తెలియజేయడం మా బాధ్యతగా భావించాం. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా వార్తల ప్రచురణలో మరింత జాగ్రత్త వహిస్తామని తెలియజేస్తున్నాం.
మా విజ్ఞప్తి….
గిరిజన సంఘాల నాయకులకు, బంజారా సంఘం సభ్యులకు, కార్యకర్తలకు, అధికారులకు, ప్రజలకు మా ఒక్కటే విజ్ఞప్తి.
దయచేసి జరిగిన పొరపాటును ఉద్దేశపూర్వక చర్యగా భావించవద్దు. ప్రచురించిన అరగంటలోనే పొరపాటును గుర్తించి, వార్తను తొలగించి, సరిచేసిన అనంతరం తిరిగి ప్రచురించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మరోసారి రెండు చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాం. మీ గౌరవాన్ని, అభిమానాన్ని కోల్పోవాలని మాకు లేదు.
వాస్తవాలను తెలుసుకోకుండా పాత వార్తా కటింగ్‌ల ఆధారంగా అపోహలకు గురికావద్దని, వాటిని మరింతగా ఫార్వర్డ్ చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
నిజం కోసం… ప్రజల పక్షం!..
సరిచేసి ప్రచూరించబడిన వార్త
.
ఇట్లు,
V1 News Telangana
వార్తా సంస్థ యాజమాన్యం
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








