-- --

పండుగ వేళా.. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం! దీపావళి వేళ పేకాట స్థావరాలపై బోధన్ టౌన్ పోలీసుల మెరుపు దాడులు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

 

ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు.. 32 మంది అరెస్ట్
రూ.1,09,570 నగదు స్వాధీనం

బోధన్, నవంబర్ 9:

దీపావళి పండుగ వేళ ప్రజలంతా ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా బోధన్ టౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పండుగ సంబరాల మధ్య చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా పేకాట స్థావరాలపై కొరడా ఝళిపించారు.

ఈ క్రమంలో బోధన్ పట్టణంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 32 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,09,570 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పండుగ సమయంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి పోలీసులు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురికావడమే కాకుండా, ఇతర సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

విధి నిర్వహణలో అప్రమత్తతకు నిదర్శనం..

పండుగైనా.. ప్రత్యేక సందర్భమైనా ప్రజల రక్షణ విషయంలో రాజీపడకుండా బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ చర్యలు అభినందనీయం. ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగలు జరుపుకోవాలనే లక్ష్యంతో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నారు.

ప్రజల భద్రతే మా బాధ్యత..

పండుగ వేళ కుటుంబాలతో సంతోషంగా గడపాల్సిన సమయంలో పేకాట, జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

పండుగ పూట కూడా ప్రజల క్షేమమే లక్ష్యంగా.. నిరంతర నిఘా, నిరంతర సేవలు అందిస్తున్న బోధన్ టౌన్ పోలీసుల కృషి అభినందనీయం. ప్రజల ప్రశాంతతే పోలీసుల విజయానికి నిజమైన గుర్తింపు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more