: జాడి సొసైటీ చైర్మన్ మల్లవరపు సుందర్ రాజును సన్మానిస్తున్న కొప్పర్గ సర్పంచ్ సయ్యద్ అహ్మద్.

బోధన్, అక్టోబర్ 26: సాలూర మండలం జాడి సొసైటీ చైర్మన్గా నియమితులైన మల్లవరపు సుందర్ రాజు దంపతులను, బోధన్ సొసైటీ చైర్మన్ పోతారెడ్డిని కొప్పర్గ గ్రామ సర్పంచ్ సయ్యద్ అహ్మద్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ, మల్లవరపు సుందర్ రాజు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్న ఆయనకు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇమామ్ బేగ్, గంగాధర్, జలీల్, పాషా, హుస్సేన్, ముసు, ఏజాస్ తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








