120 మంది ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం – 250 మందికి పైగా క్లబ్ సభ్యుల హాజరు….
బోధన్, అక్టోబర్ 25: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్–103, రీజియన్–3 ఆధ్వర్యంలో బోధన్‌లోని మహాలక్ష్మి వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం వైభవంగా జరిగింది. రీజియన్ చైర్మన్ వీఎన్ కేజీసీఎఫ్ శ్రీ యక్కలి రామకృష్ణ, పద్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని వివిధ వాసవి క్లబ్‌ల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రీజియన్ పరిధిలోని అన్ని క్లబ్‌ల ప్రతినిధులు తమ తమ క్లబ్‌ల బ్యానర్లను ప్రదర్శించడంతో పాటు, ఏడాది కాలంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆయా క్లబ్‌లు చేపట్టిన సేవా కార్యక్రమాలు, వాటి వివరాలను రీజియన్ చైర్మన్ రామకృష్ణ వివరించారు.
సంవత్సర కాలంలో వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులను గుర్తించి, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో సుమారు 120 బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం క్లబ్ సభ్యుల్లో సేవాభావాన్ని, ఐక్యతను మరింత పెంపొందించేలా సాగింది.
ఈ కార్యక్రమానికి వన్ సిల్వర్ స్టార్ శ్రీ కలికోట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రోగ్రామ్ అబ్జర్వర్‌గా వీఎన్ కేజీసీఎఫ్ బొంపల్లి రాజు పాల్గొని, వాసవి క్లబ్‌ల నిర్వహణ, సభ్యుల బాధ్యతలు, క్లబ్ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.
అలాగే వీఎన్ సిల్వర్ స్టార్ గుడిపల్లి రమేష్, వీఎన్ సిల్వర్ స్టార్ విశ్వనాథం శ్రీనివాస్, వీఎన్ గోల్డెన్ స్టార్ గట్టు రాణి, వీఎన్ 103ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కేజీసీఎఫ్ మాశెట్టి నర్సయ్య, వీఎన్ సిల్వర్ స్టార్ బొడ్ల పురుషోత్తం, వీఎన్ 103ఏ డిస్ట్రిక్ట్ జోన్ చైర్పర్సన్ ఢీకొండ కిరణ్మయి, బిళ్లకంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రీజియన్–3 పరిధిలోని అన్ని క్లబ్‌లకు చెందిన సభ్యులు సుమారు 250 మంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జై వాసవి… జై జై వాసవి!
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







