-- --

తగ్గెల్లి శివారులో ఇసుక ట్రాలీ ఆటో పట్టివేత…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు: రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్….

: ఇసుకతో ఉన్న ట్రాలీ ఆటోను పట్టుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్.

బోధన్, అక్టోబర్ 24: సాలూర మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతమైన తగ్గెల్లి గ్రామం నుంచి అనుమతులు లేకుండా ట్రాలీ ఆటోలో ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ శనివారం తగ్గెల్లి గ్రామ శివారులో పట్టుకున్నారు.

ఇసుకతో ఉన్న ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, సరైన అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టడం చట్టవిరుద్ధమని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు నిఘా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more