ప్రజాసేవకు గుర్తింపుగా పదవి లభించడం అభినందనీయం: బండారుపల్లి సర్పంచ్ కాడి సాయిలు….
బోధన్, అక్టోబర్ 26: సాలూర మండలం జాడీ సొసైటీ చైర్మన్‌గా నియమితులైన మల్లవరపు సుందర్ రాజును బండారుపల్లి గ్రామ సర్పంచ్ కాడి సాయిలు, ఉపసర్పంచ్ సుభాష్ సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుందర్ రాజును శాలువాతో ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కాడి సాయిలు మాట్లాడుతూ, మల్లవరపు సుందర్ రాజు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసిన వ్యక్తికి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు లభించడం సంతోషకరమని అన్నారు.
నూతన బాధ్యతల్లో సుందర్ రాజు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులు మరియు సొసైటీ సభ్యుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దిగంబర్, మారుతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు…

: జాడీ సొసైటీ నూతన చైర్మన్ మల్లవరపు సుందర్ రాజును శాలువాతో సన్మానిస్తున్న బండారుపల్లి సర్పంచ్ కాడి సాయిలు. పక్కన ఉపసర్పంచ్ సుభాష్, గ్రామ పెద్దలు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







