ఎరాజ్ పల్లిలో ప్రథమ వర్ధంతి కార్యక్రమం.. ఆయన సేవలను స్మరించుకున్న ప్రముఖులు…
బోధన్, అక్టోబర్ 25: బోధన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దివంగత జంగం ఉమాకాంత్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఆయన స్వగ్రామమైన ఎరాజ్ పల్లిలోని నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్డీసీసీబీ మాజీ డైరెక్టర్, బోధన్ మాజీ ఎంపీపీ గిర్దావార్ గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం గంగులు మాట్లాడుతూ.. జర్నలిస్టుగా జంగం ఉమాకాంత్ అందించిన సేవలను, ఆయన సామాజిక స్పృహను, మానవతా దృక్పథాన్ని కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు తన వంతు సేవలు అందించడంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు.
ఆయన మరణం జర్నలిస్టు రంగానికి, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని, వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవీదాస్ గౌడ్, శ్యామ్, ఫోటో స్టూడియో సునీల్, జర్నలిస్టులు మల్లన్న, రమేష్, మిత్రబృందం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







