బోధన్: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉత్సవ మండపాల నిర్వాహకులు, సార్వజనిక ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సార్వజనిక ఉత్సవ కమిటీ పెద్దలు, మండప నిర్వాహకులు, ఏఎస్ఐ చిరంజీవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







