-- --

*లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో “పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ” వారు అందించిన ఉచిత వీల్ చైర్ పంపిణి*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వీల్‌చైర్ పంపిణీ…

బోధన్, అక్టోబర్ 12: లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన ఉచిత వీల్‌చైర్‌ను జాడి జమాల్‌పూర్ గ్రామానికి చెందిన దాసరి చిన్నయ్యకు సోమవారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ లయన్ ఎం. గోవింద్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు లయన్ కుమ్మరి పోశెట్టి, కార్యదర్శి లయన్ గుడిపల్లి గంగారెడ్డి, కోశాధికారి లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అలాగే లయన్ డి. తామసయ్య, లయన్ బి. రమేష్, లయన్ ఎం. ఆదినారాయణ రెడ్డి, లయన్ ఎం. సంతోష్ రెడ్డి, లయన్ కోటేశ్వరరావు, లయన్ కె. వెంకట్రావు, లయన్ ఎస్. ఆంథోని మేరీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి లయన్ ఎస్. ఆంథోని మేరీ ప్రోగ్రాం చైర్మన్‌గా వ్యవహరించారు.

సేవా కార్యక్రమాల్లో భాగంగా వీల్‌చైర్‌ను అందజేయడం ద్వారా అవసరమైన వారికి సహాయం అందించినట్లు క్లబ్ కార్యదర్శి గుడిపల్లి గంగారెడ్డి తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more