సంప్రదాయ దుస్తుల్లో మహిళల ఆటపాటలు.. పూల బతుకమ్మలతో ఘనంగా వేడుకలు…
బోధన్, అక్టోబర్ 12: సాలూర గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ, గౌరమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మహిళలు, యువతులు వలయాకారంలో చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళల సందడి, పూల బతుకమ్మల అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేడుకల్లో భాగంగా బతుకమ్మలను ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి, గ్రామ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్‌లో నిమజ్జనం చేశారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమించి పండుగను ఆనందోత్సాహాల మధ్య ముగించారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, పూల వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం విశేషం.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








