-- --

ఇందూర్ హైస్కూల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పూల పండుగలో విద్యార్థినుల ఆటపాటలు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం…..

, అక్టోబర్ 9: బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లిలో గల ఇందూర్ హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం శుక్రవారం పాఠశాల ఆవరణలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించింది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా ఆడిపాడుతూ సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ వేడుకలకు స్థానిక కౌన్సిలర్ వేములపల్లి రామ్మూర్తి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. పూలను ప్రకృతికి ప్రతీకగా భావిస్తూ, మహిళలు సామూహికంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూడా తమ విద్యాసంస్థ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థినుల్లో ఆనందోత్సాహాలను నింపాయి. సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ఇందూర్ విద్యాసంస్థల డైరెక్టర్లు కొడాలి సాయి విపంచి, హితిష్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more