-- --

ఎండిన వరి పంటలపై మోరిల్ శ్రీనివాస్ ఆవేదన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రైతుల సమస్యలను మాజీ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లిన ప్రముఖ వ్యాపారవేత్త….

బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో నీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి పంటలను ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని ఆయన స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ పంటల పరిస్థితి, సాగునీటి కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు, పంట సాగుకు చేసిన పెట్టుబడులు నష్టపోయిన తీరును మోరిల్ శ్రీనివాస్‌కు వివరించారు. రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన, వారి సమస్యలను మాజీ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.

ఎండిపోయిన వరి పంటల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి సమస్యలను ఉన్నతస్థాయిలో దృష్టికి తీసుకెళ్లేందుకు మోరిల్ శ్రీనివాస్ చొరవ చూపడంపై సిద్దాపూర్ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more