-- --

రాజ్యాంగ విలువలు, హక్కులు–బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, అక్టోబర్ 7, 2026:
చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్, బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి దేవోల్లా శంకర్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా దేవోల్లా శంకర్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందన్నారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని, తమ హక్కులు, విధులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. యువతలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌర సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వీరేందర్ సింగ్, సురేష్ ఇనని, పెర్కా వెంకటేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు రాజ్యాంగ ప్రతులను అందజేశారు.

“రాజ్యాంగాన్ని తెలుసుకుందాం – హక్కులను కాపాడుకుందాం – బాధ్యతలను నిర్వర్తిద్దాం” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more