లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో వైద్య శిబిరం….
బోధన్, అక్టోబర్ 7: లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో బుధవారం సాలురా క్యాంపులో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ లయన్ సూరబత్తుని శ్రీనివాస్ రావు, క్లబ్ అధ్యక్షులు లయన్ కుమ్మరి పోశెట్టి, కార్యదర్శి లయన్ గుడిపల్లి గంగారెడ్డి, లయన్ ఎం. ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ అజయ్, క్యాంపు ఇన్చార్జి లయన్ హనుమంత్ రావు, సర్పంచ్ డి. విజయ్ భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ అవుత్ మహేష్ రెడ్డి, సూరా శివకోటి రెడ్డి, జగన్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ ఎం. ఆదినారాయణ రెడ్డి వ్యవహరించారు. శిబిరానికి గ్రామస్తులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







