-- --

మందర్నలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

త్వరితగతిన నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలి..

బోధన్: సాలూర మండలం మందర్న గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామ పెద్దలు, బీజేపీ మండల అధ్యక్షుడు రావుబా గంగాధర్, పంచాయతీ కార్యదర్శి శిల్ప లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం నాణ్యతతో నిర్మించుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం నిబంధనల ప్రకారం విడతలవారీగా చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్, పంచాయతీ కరోబార్‌తో పాటు గ్రామస్థులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more